తెలంగాణ సాహిత్యానికి దక్కిన గౌరవం: డా.నామోజు బాలాచారి

తెలంగాణ సాహిత్యానికి దక్కిన గౌరవం: డా.నామోజు బాలాచారి

HYD: తెలంగాణ గడప గడపను చైతన్య పరిచిన నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కడంపై తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ సాహిత్యానికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపు అని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా సిధారెడ్డిని స్వయంగా కలిసి అభినందనలు తెలిపారు. అకాడమీ తొలి అధ్యక్షుడిగా ఆయన చేసిన కృషి మరువలేనిదని బాలాచారి గుర్తుచేశారు.