సదుం ప్రాజెక్టుకు చేరుతున్న వరద

CTR: సదుం మండలంతో పాటు సోమల మండల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గార్గేయ నది ద్వారా వర్షపు నీరు కొర్లగుంటవారిపల్లి ప్రాజెక్టుకు చేరుతోంది. ఇప్పటికే 70 శాతం ప్రాజెక్టు నిండినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ మేరకు రెండు రోజుల్లో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉందని వారు వెల్లడించారు.