చర్లపల్లి నుంచి భారత్ గౌరవ్ ట్రైన్ సర్వీస్
MDCL: చర్లపల్లి నుంచి భారత్ గౌరవ్ ట్రైన్ సర్వీస్ హాల్ట్ చేశారు. ఈ ప్రత్యేక రైలు ద్వారా ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. సౌకర్యవంతమైన కోచ్‌లు, భోజన సదుపాయం, టూర్ ప్యాకేజీలతో ఈ సేవ అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుభూతిని అందించడమే లక్ష్యంగా DRM గోపాలకృష్ణన్ వివరించారు.