జువ్వలదిన్నెలో పరిశ్రమకు మంత్రి శంకుస్థాపన
నెల్లూరు జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా జువ్వలదిన్నెలో సాగర్ ఢిఫెన్స్ ఇంజినీరింగ్ పరిశ్రమకు ఆయన శంకుస్థాపన చేశారు. అత్యాధునిక అటానమస్ మారిటైమ్ షిప్ యార్డును ఇక్కడ అభివృద్ధి చేయనున్నారు. ఈ పరిశ్రమ ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని మంత్రి పేర్కొన్నారు. కాగా.. రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్ధే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుంది.