మొక్కజొన్న కొనుగోలు కేంద్రాం ఏర్పాటు చేయాలని విన్నతి
NGKL: బిజినపల్లి మండలంలో అదనంగా మరో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ రైతులు సోమవారం 'ప్రజావాణి'లో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. మండలంలో 34 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, కేవలం ఒక్క కేంద్రం ఉండటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మాజీ సైనికుడు వెంకట్, రైతులు రాము, జయప్రకాశ్ తెలిపారు.