జిల్లా స్థాయి క్రికెట్ జట్టు ఎంపిక..
MBNR: జిల్లా కేంద్రంలోని ఫ్రీడమ్ మైదానంలో ఈ నెల 11న అండర్-23 'టుడే లీగ్' క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఉదయం 8 గంటలకు సొంత కిట్టు, ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు మైదానంలో సంప్రదించాలన్నారు.