రేపు జిల్లాలో ఈ ఆలయాలు మూసివేత
NDL: యాగంటి ఉమామహేశ్వర స్వామి, నందవరం శ్రీ చౌడేశ్వరి మాత ఆలయాలను మంగళవారం రాహుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్నట్లు ఈవోలు పాండురంగారెడ్డి, శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. యాగంటి ఆలయంలో మంగళవారం ఉదయం 6.30కి ప్రాతః కాల పూజల అనంతరం ఆలయాన్ని మూసివేసి 4 తెల్లవారుజామున శుద్ధిచేసి, ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు.