KUలో పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
HNK: హనుమకొండ నగరంలో కాకతీయ యూనివర్సిటీ సైన్స్, లైఫ్ సైన్స్ విభాగాల్లో పీహెచ్‌డీ అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 55 సీట్లు ఖాళీగా ఉండగా, అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నెట్ లేదా స్లెట్ అర్హతతో పాటు ఎంఎస్సీలో కనీసం 55 శాతం మార్కులు ఉండాలి. ఓసీ అభ్యర్థులకు రూ.1200, ఇతరులకు రూ.800 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు.