పాండ్రంగి గ్రామానికి రాకపోకలు బంద్

పాండ్రంగి గ్రామానికి రాకపోకలు బంద్

VSP: పద్మనాభం మండలం పాండ్రింగి గ్రామం వద్ద భారీ వర్షాల కారణంగా గోస్తనీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నదీ తీరంలో బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఎంఆర్‌ఓ కె. ఆనందరావు వీఆర్‌‌వోలను ఆదేశించారు. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు సహకరించాలని, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.