రేపు వైసీపీ నాయకుల ఆత్మీయ సమావేశం

ప్రకాశం: అర్ధవీడు మండలంలోని వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు సోమవారం మండల స్థాయి ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లుగా మండల వైసీపీ కన్వీనర్ ఏరువ రంగారెడ్డి తెలిపారు. అర్ధవీడులోని సాయి ఫంక్షన్ హాల్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నామని, గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ కెపి. నాగార్జున రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు.