జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే TWJF లక్ష్యం

MNCL: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి TWJF ముందుంటుందని TWJF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య అన్నారు. శనివారం ఉదయం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వేంపల్లి మంచిర్యాల గార్డెన్‌లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ 3వ మహాసభలు నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులను ఖూని చేస్తుందన్నారు.