ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ఆశా వర్కర్‌లు

VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయనను శనివారం బొబ్బిలి కోటలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో స్దానిక ఆశా వర్కర్‌లు మర్యాద పూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు వేతనంతో కూడిన మెటర్నటీ లీవ్, ఉద్యోగ విరమణ వయసు పెంపు, గ్రాట్యూటీ ఇస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వారు కృతజ్ఞతలు తెలిపారు.