పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గండ్ర
BHPL: మహిళల్లో గర్భాశయ (సర్వైకల్) క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించే పోస్టర్లను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు HPV వ్యాక్సిన్ వేయించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే గర్భాశయ క్యాన్సర్‌ను సమర్థవంతంగా నివారించవచ్చని, అవగాహన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.