రోడ్డు ప్రమాదంలో వాహనదారుడికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో వాహనదారుడికి తీవ్ర గాయాలు

ప్రకాశం: సింగరాయకొండ మండల పరిధిలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఘటనలో ద్విచక్ర వాహనదారుడుకు తీవ్ర గాయాలు కావడంతో హైవే పోలీసులు అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుడు వివరాలు తెలియాల్సి ఉంది.