ఆటోను ఢీకొన్న బొలెరో వాహనం
CTR: పుంగనూరు మండలం రాంపల్లి వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి నుంచి పుంగనూరు వైపు వస్తున్న ఆటోను బొలెరో లగేజ్ వాహనం ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 కు సమాచారం అందించారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.