కోటితో గ్రామాల అభివృద్ధి చేస్తాం: మాజీ ఎంపీపీ
GDWL: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం గట్టు మండలం అంతంపల్లి గ్రామంలో ₹5 లక్షలతో సీసీ రోడ్డు పనులకు సర్పంచ్ శంకరమ్మతో కలిసి గట్టు మాజీ ఎంపీపీ జే విజయ్ కుమార్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీపీ మాట్లాడుతూ.. గట్టుకు విడుదలైన ఒక కోటి రూపాయలతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.