పింఛన్ అందజేసిన సీఎం చంద్రబాబు

పింఛన్ అందజేసిన సీఎం చంద్రబాబు

సత్యసాయి: సీఎం చంద్రబాబు నాయుడు పెద్దన్నవారిపల్లె గ్రామంలో పర్యటించారు. 'పేదల సేవలో' కార్యక్రమంలో పాల్గొని గ్రామంలోని మేడం రెడ్యమ్మకు వితంతు పింఛను, మేడా మల్లయ్యకు వృద్ధాప్య పింఛను అందించారు. గ్రామస్థుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.