జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

అన్నమయ్య: రాయచోటిలో "హర్ ఘర్ తిరంగా"లో భాగంగా 100 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, పర్యాటక అధికారి నాగభూషణం, డీఈవో సుబ్రహ్మణ్యం, డీఎస్పీ కృష్ణమోహన్ తదితరులు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. చిత్తూరు రోడ్డు శివాలయం నుంచి బంగ్లా సర్కిల్ వరకు ర్యాలీ సాగి, చివరగా విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేసి జాతీయ గీతం ఆలపించారు.