తెలంగాణ గణిత ఫోరం అధ్యక్షులుగా కొండల్ రెడ్డి
మెదక్ జిల్లా కేంద్రంలో శనివారం తెలంగాణ గణిత ఫోరం ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా అధ్యక్షులుగా కొండల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గోపాల్, కోశాధికారిగా శివ నాగరాజు, ఉపాధ్యక్షులుగా బాలరాజు, ఎన్నికైనట్లు గౌరవ అధ్యక్షులు సదన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో గణిత నైపుణ్యాలు పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతామని పేర్కొన్నారు.