రెడ్ క్రాస్ అనాధాశ్రమంలో ఘనంగా రాఖీ వేడుకలు

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండ రెడ్ క్రాస్ అనాధాశ్రమంలో రాఖీ పౌర్ణమి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ నటరాజ్, యూత్ రెడ్ క్రాస్ సొసైటీ కోఆర్డినేటర్ బాబుల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. అనాధ చిన్నారుల మధ్య సఖ్యత పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు.