రేషన్ బియ్యం తరహాలో రేషన్ పెట్రోల్, డీజిల్

రేషన్ బియ్యం తరహాలో రేషన్ పెట్రోల్, డీజిల్

పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోంది. ఇంధన కొరత తీవ్రంగా పెరుగుతోంది. దీంతో ఇంధన కొరతను ఎదుర్కొనేందుకు స్లోవేనియా కొత్త చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఇంధన రేషన్ విధానాన్ని అమలు చేసింది. స్లోవేనియా ప్రభుత్వం నిర్ణయంతో ఆ దేశంలోని పెట్రోల్, డీజిల్‌లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఈ విధానాన్ని అమలు చేసిన తొలి యూరోపియన్ యూనియన్ దేశంగా స్లోవేనియా నిలిచింది.