టీచర్ మృతిపై హోంమంత్రి దిగ్భ్రాంతి
AKP: పాయకరావుపేట మండలం రాజానగరం జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయురాలు జోష్నాబాయి మృతిచెందడం పట్ల హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరిపి నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించారు. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.