VIDEO: 'నేస్తం బడికి రా' కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు
కృష్ణా: గుడివాడ గర్ల్స్ హై స్కూల్ పాఠశాల విద్యార్థులు 'నేస్తం బడికి రా' కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. విద్య ప్రాముఖ్యతను తెలియజేస్తూ, బడికి రప్పించే లక్ష్యంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పలు వీధుల్లో నినాదాలు చేస్తూ, తల్లిదండ్రులకు పిల్లలను నిరంతరం పాఠశాలకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.