దోమకొండలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
KMR: దోమకొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బొమ్మెర శ్రీనివాస్ జెండా ఆవిష్కరణ చేశారు. తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్ కృషి చేసిందని, 2028లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని నాయకులు అన్నారు. కార్యక్రమంలో కుంచాల శేఖర్, గజవాడ శ్రీకాంత్, పాలకుర్తి శేఖర్, కడారి రమేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.