అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

NTR: రెడ్డిగూడెం మండలం కదప గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం పొలంలో కాపలాగా ఉంటున్న గొల్లమందల వెంకయ్య అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకయ్య మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.