భూ సర్వే పొరపాట్లను సరిచేయండి: సప్తగిరి ప్రసాద్

భూ సర్వే పొరపాట్లను సరిచేయండి: సప్తగిరి ప్రసాద్

CTR: పూతలపట్టు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో జరిగిన భూ సర్వే పొరపాట్లను సరిదిద్దాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గురువారం కమిషనర్ (సర్వే & ల్యాండ్ రికార్డ్స్) కూర్మనాథ్‌కు విజ్ఞప్తి చేశారు. తవణంపల్లి, యాదమరి, బంగారుపాళ్యం, ఐరాల, చిత్తూరు మండలాల్లో సర్వే నంబర్లలోని పొరపాట్లు, ఫొటో మార్పులు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.