ప్రమాదాలకు నిలయంగా మారుతున్న ORR రోడ్డు

మేడ్చల్: కీసర ORR టర్నింగ్ పాయింట్లు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. గత ఏడాది కాలంలో పదికి పైగా ప్రమాదాలు జరిగి, అనేక మంది గాయాల పాలై ఇబ్బందులు పడ్డారు. అయితే.. దీనికి అతివేగమే ముఖ్య కారణంగా పోలీసు అధికారులు తెలిపారు. మరోవైపు రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్ల నుంచి వచ్చే వాహనాల ద్వారా కాంక్రీట్ రోడ్డుపై పడి, ఇబ్బందులు పడుతున్నట్లు వాహనదారులు చెబుతున్నారు.