గ్రంథాలయాల సమస్యపై పవన్ కీలక హామీ

గ్రంథాలయాల సమస్యపై పవన్ కీలక హామీ

AP: ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయాల అభివృద్ధి, నిధుల విడుదలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు వన్నెంరెడ్డి సతీష్ వినతిపత్రం ఇచ్చారు. రూ.30 కోట్ల బకాయిలు, సొంత భవనం లేకపోవడం వంటి సమస్యలను వివరించారు. దీనిపై పవన్ స్పందిస్తూ.. బకాయిల విడుదల, ఆధునీకరణకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా మన్యంలో డిజిటల్ గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.