వనదుర్గా మాతకు భాను వాసరే ప్రత్యేక పూజలు

వనదుర్గా మాతకు భాను వాసరే ప్రత్యేక పూజలు

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల పుణ్యక్షేత్రంలో ఆదివారం వన దుర్గ భవాని మాతకు భాను వాసరే ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైశాఖమాసం, శుక్లపక్షం, సప్తమి తిథి పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు మంజీరా పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. ఈరోజు సెలవు దినం కావడంతో భక్తులు వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.