ఆ గ్రామాల్లో ప్రజా దర్బార్.. ఎప్పుడంటే..?

ఆ గ్రామాల్లో ప్రజా దర్బార్.. ఎప్పుడంటే..?

MLG: జిల్లాలో నాలుగు గ్రామాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ దివాకర టి ఎస్ తెలిపారు. మంగళవారం రాయని గూడెం, సర్వాపురం గ్రామాల్లో, బుధవారం రాజుపేట, మల్లూరు గ్రామాల్లో నిర్వహించనున్నారు. రాష్ట్ర మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కారం చూపనున్నారు. స్థానిక ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించాలన్నారు.