కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌కు అచ్చెన్నాయుడు లేఖ

కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌కు అచ్చెన్నాయుడు లేఖ

AP: పత్తి రైతుల సమస్యలపై కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌కు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. మొంథా తుఫాన్ ప్రభావంతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతిందని, పత్తి రైతులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం సహకరించాలని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. కాగా, మొంథా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో పత్తి రైతులు నష్టపోయిన విషయం తెలిసిందే.