డిగ్రీ కళాశాలకు రూ. 30,000 ఆర్థిక సహాయం
WGL: వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మౌలిక సదుపాయాల కోసం రూ. 30,000 ఆర్థిక సహాయాన్ని అల్లమనేని మోహన్ రావు శనివారం కళాశాల ప్రిన్సిపాల్ జి. పోషయ్యకు అందజేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కళాశాలలో కనీస అవసరాలను ఏర్పాటు చేయడం లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారి రఘు, కళాశాల ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.