మూసీకి కొనసాగుతున్న వరద ప్రవాహం

మూసీకి కొనసాగుతున్న వరద ప్రవాహం

NLG: మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1283.09 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ఒక్క గేటును ఒక అడుగు మేర ఎత్తి 974.32 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 644.30 అడుగుల వద్ద నీరు ఉంది. ప్రాజెక్టులో 4.28 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారి మధు తెలిపారు.