నేడు మెగా జాబ్ మేళా
SKLM: జలుమూరు మండలం వంశధార డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సాయికుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేళాలో పలు సంస్థల ప్రతినిధులు పాల్గొని, సుమారు 500 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. విషయాన్ని గమనించి నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.