'పశువులకు టీకాలు వేయించండి'

'పశువులకు టీకాలు వేయించండి'

కామారెడ్డి: జుక్కల్ మండలం కంఠాలి గ్రామంలో గురువారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. పశువైద్యాధికారి పండరినాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగనాథ్ పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. ముందస్తుగా టీకాలు వేయించడం వల్ల పశువుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, వ్యాధుల బారి నుండి రక్షించుకోవచ్చని పేర్కొన్నారు.