చలి మంటల మాటున.. విష వాయువులు
HYD: గ్రేటర్ హైదరాబాద్‌ను చలి వణికిస్తోంది. చలి నుంచి ఉపశమనం కోసం ప్రజలు చెత్త, చెక్కలతో మంటలు వేస్తున్నారు. ప్లాస్టిక్, రబ్బరు వంటివి మండించడం వల్ల విషపూరిత వాయువులు గాలిలో కలుస్తున్నాయి. ఏది కాల్చినా పొగ వస్తుంది, కానీ ప్లాస్టిక్, రబ్బరు మండిస్తే విషం వస్తుందని నిపుణులు హెచ్చరించారు. దీనివల్ల వాయు నాణ్యత క్షీణించి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.