VIDEO: గుంతల రోడ్డుతో వాహనదారుల ఇబ్బందులు
SRCL: తంగళ్ళపల్లి నుంచి లక్ష్మీపూర్ వెళ్లే రహదారి పూర్తిగా గుంతల మయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై వెళ్లాలంటే వాహనాలు అదుపుతప్పి కిందపడే ప్రమాదం ఉందని వాపోయారు. రోడ్డు మీద వెళ్లాలంటే వాహనాలు సైతం పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయించాలని డిమాండ్ చేశారు.