క్రీడల పట్ల ఆసక్తి కోసమే సంసాద్ ఖేల్: ఎంపీ
ADB: జిల్లాలోని విద్యార్థులు, యువతను క్రీడల పట్ల ఆకర్షితులను చేసేందుకు సంసాద్ ఖేల్ అభియాన్ క్రీడా పోటీలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు ఎంపీ గోడం నగేష్ తెలిపారు. గురువారం ఆదిలాబాద్ లోని ఆయన నివాసంలో క్రీడా పోటీల నమోదు యాప్‌ను ప్రారంభించారు. జిల్లా గిరిజన క్రీడాధికారి పార్థసారథి, డీవైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, స్కూల్ గేమ్స్ సెక్రెటరీ రామేశ్వర్ ఉన్నారు.