సూర్యాపేట మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు!
సూర్యాపేట మున్సిపల్ పోరుకు రంగం సిద్ధమైంది. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆధ్వర్యంలో 48 వార్డులకు డ్రా పద్ధతిన రిజర్వేషన్లు ఖరారు చేశారు. మహిళలకు 50 శాతం పైగా స్థానాలు దక్కగా, 27వ వార్డు జనరల్ మహిళకు, 28వ వార్డు ఎస్సీకి కేటాయించారు. రిజర్వేషన్ల రాకతో ఆశావహుల్లో ఉత్కంఠ పెరగగా, ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాల వేటలో నిమగ్నమయ్యాయి.