యుద్ధం వేళ.. ఇరాన్ సంచలన ప్రకటన
పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. హర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ప్రకటించింది. ఒకవేళ చమురు, LNGని తరలించే నౌకలు దానిని దాటడానికి ప్రయత్నిస్తే తమ నౌకాదళం వాటిపై దాడులు చేస్తుందని హెచ్చరించింది. ప్రపంచం వాడే ఐదో వంతు రవాణా ఈ జలసంధి నుంచే అవుతోంది. ఇరాన్ నిర్ణయంతో చమరు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.