VIDEO: 'హమాలీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి'
KMR: బీర్కూరు టీహెచ్ డబ్ల్యుయూలో ఆదివారం 90 మంది హమాలీలు సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడి 11 ఏళ్లు గడుస్తున్నా హమాలీలకు ఎలాంటి గుర్తింపు లభించలేదన్నారు. హమాలీల కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు.