లైన్ మెన్ దినోత్సవం.. విద్యుత్ సిబ్బందికి సన్మానం
JGL: భీమారంలో ‘లైన్ మెన్ దినోత్సవం’ సందర్భంగా విద్యుత్ శాఖ లైన్‌మెన్లను సర్పంచ్ స్వాతి సంజీవ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధిలో విద్యుత్ సిబ్బంది పాత్ర కీలకమని, ప్రాణాలకు తెగించి విధి నిర్వహణలో వారు చూపుతున్న అంకితభావాన్ని కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.