VIDEO: 53వ రోజు కొనసాగిన రైతుల నిరసన

AKP: మాకవరపాలెం మండలం జీ. కోడూరు క్వారీని రద్దు చేయాలని రైతులు ఇవాళ 53వ రోజు కూడా నిరసన చేపట్టారు. కేవిపీఎస్ నాయకులు ఈరెల్లి చిరంజీవి మాట్లాడుతూ.. గత 53 రోజులుగా వీరు ఇక్కడ నిరసనలు చేస్తున్నా అధికారులు కన్నెత్తి కూడా చూడలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.