ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
NGKL: కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో మాధవి (33) అనే గృహిణి ఇంట్లోనే చీరతో ఉరివేసుకుని మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని స్థానికులు చెబుతున్నారు. మృతురాలి భర్త కానిస్టేబుల్ అని సమాచారం. ఈ దుర్ఘటన కారణంగా ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.