'కేసుల పరిష్కారానికి పోలీసుల సహకారం కావాలి'

BHPL: జిల్లా కేంద్రంలో శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేశ్ బాబు ఆధ్వర్యంలో పోలీసులతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 13న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని, కేసుల పరిష్కారంలో పోలీసులు కీలక పాత్ర పోషించాలని రమేశ్ బాబు సూచించారు. ఈ సమావేశంలో పోలీసు అధికారులకు కేసుల పరిష్కారానికి సంబంధించిన సూచనలు అందజేశారు.