'జడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేయాలి'

'జడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేయాలి'

అన్నమయ్య: పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలను రద్దు చేసి, తిరిగి నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు జరిపించాలని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి డిమాండ్ చేశారు. మంగళవారం రాజంపేటలో ఆయన మాట్లాడారు. దేశ చరిత్రలో ఇలాంటి ఎన్నికలు ఎక్కడా జరగలేదని పేర్కొన్నారు. కడప జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లా నుంచి కూడా వందలాది మంది వచ్చి ప్రతి గ్రామంలో పోలీసుల సహకారంతో దొంగఓట్లు వేస్తున్నారన్నారు.