VIDEO: అన్నవరం సత్యదేవుని ఆదాయం రూ. 18.98 లక్షలు

VIDEO: అన్నవరం సత్యదేవుని ఆదాయం రూ. 18.98 లక్షలు

KKD: అన్నవరం సత్యదేవుని సన్నిధి మంగళవారం భక్తులతో కిక్కిరిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు వేలాది మంది స్వామిని దర్శించుకున్నారు. దేవస్థానంలో స్వర్ణ పుష్పార్చన, కుంకుమార్చన, వ్రతాలు విశేషంగా జరిగాయి. వివిధ విభాగాల ద్వారా ఒకే రోజు ఆలయానికి రూ. 18.98 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. భక్తుల తాకిడితో కొండపై ఆధ్యాత్మిక సందడి నెలకొంది.