VIDEO: కూరగాయల మార్కెట్‌లో స్వచ్ఛ కార్యక్రమం
WGL: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో 99 రోజుల కార్యక్రమంలో భాగం WGL లక్ష్మిపురం కూరగాయల మార్కెట్‌లో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ కమిటీ ఉద్యోగులు, కూరగాయల వ్యాపారులు చీపుర్లు పట్టి మార్కెట్‌ను శుభ్రం చేశారు. చెత్త తొలగింపు, మురుగు నీటి పారుదలతో పాటు మార్కెట్ పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు.