విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్
W.G: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించని ఏజెన్సీలు, సక్రమంగా పర్యవేక్షించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెట్రి సెల్వి హెచ్చరించారు. పాఠశాలలు, వసతి గృహాలలో భోజన పథకం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సమీక్షించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందజేయాలని సూచించారు