VIDEO: ఉచిత కంటి వైద్య శిబిరం
NZB: వేల్పూర్ మండలం పడగల గ్రామంలో ఇవాళ ఆర్మూర్ స్నేహ లేజర్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు, అద్దాలు ఉచితంగా అందజేశారు. డాక్టర్ స్నేహ మాట్లాడుతూ.. ఉదయం నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.